Thursday, December 19, 2024

ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారు?: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

What did PM Modi do to Telangana ?: Minister Errabelli

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. పెట్రో ధరలు ఎందుకు పెంచారు.. ఎందుకు తగ్గించారన్నారు. ఈ సీజన్ లో ఉపాధి పనిదినాలను కేంద్రం 4 కోట్లు తగ్గించిందని ఎర్రబెల్లి తెలిపారు. 16 కోట్ల పనిదినాలు ఇవ్వాలని తీర్మానం చేశామని ఆయన పేర్కొన్నారు. ఉపాధిహామీని సాగుకు అనుసంధానించాలని మళ్లీ తీర్మానం చేశామన్నారు. పట్టణాల్లోనూ ఉపాధిహామీ అమలు చేయాలని తీర్మానించామని ఆయన సూచించారు. కేంద్రం 3 నెలలుగా ఉపాధిహామీ బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు. ఒకట్రెండు నెలలు బిల్లులు ఆలస్యం కావచ్చు, తొందరపడవద్దని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News