Monday, January 20, 2025

రైతన్నా నీకు ఏది కావాలి? ఆలోచించుకో!

- Advertisement -
- Advertisement -

మంత్రి కెటిఆర్ ఆసక్తికర ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరు దశాబ్దాలు మనల్ని ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా లేదా నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన సిఎం కెసిఆర్ కావాలో ఎంచుకోవాలంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, గత 60 ఏండ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని ఆగంచేసిన కాంగ్రెస్ పాలనను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కర్ణాటక కాంగ్రెస్ అమలు చేస్తోన్న కార్యక్రమాలను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు. ‘తెలంగాణ రైతన్నా ఏది కావాలి మనకు?. ఆలోచించు, కెసిఆర్ కడుపు నిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్ కావాలా? లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంట్ కావాలా? లేకుంటే పిసిసి చీఫ్ చెప్పిన 3 గంటల కరెంట్ కావాలా?’ అని ప్రశ్నించారు. అలాగే, ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాల్నా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, మళ్లీ ఆ రోజులు కావాల్నా? లేదా రైతుబంధు, రైతుబీమా తెచ్చి, చెరువులు బాగు చేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కెసిఆర్ కావాల్నా?’ అంటూ ట్విట్టర్ వేదికగా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News