Wednesday, January 22, 2025

షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అదిక బరువు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలితో ప్రజలు మధుమేహం వ్యాధికి ఆజ్యం పోస్తున్నాయి. ముఖ్యంగా యువకుల్లో మధుమేహం విపరీతంగా పెరుగుతోంది. ఇది ప్రధానంగా గత ఒకటి, రెండు దశాబ్దాలలో జీవనశైలి మార్పు కారణం. మధుమేహం ఉన్నవారిలో సాధారణ లక్షణాలు ఎక్కువగా మూత్రవిసర్జన, దాహం పెరగడం, ఆకలి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ స్దాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సంభిస్తాయి. అలాంటి వారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి.

ఆహారం: ఇన్సులిన్ తీసుకోని టైప్ 2 మధుమేహం ఉన్న వారికి నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు వంటి సాధారణ ఆహార మార్పులు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, తృణద్యానాలు, పాల ఉత్పత్తుల నుంచి కార్బోహైడ్రైట్ తీసుకోవడం, ఫైబర్ అధికంగా ఉండే, తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్న ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా చక్కెరలను కలిగి ఉన్న ఇతర వనరుల కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అదికంగా ఉండే ఆహారం గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి, సివిడి ప్రమాదాన్ని తగ్గించడానికి పరిగణించబడుతుంది. పండ్లు, మొలకలు, గింజలు మొదలైన ఆరోగ్యకరమైన చిరుతిండి ఎంపిక చేసుకోవాలి. పోషకాహారం కానివి మితమైన మొత్తంలో తీసుకోవచ్చు. అల్కహాల్ తీసుకోవడంతో మధుమేహం ఉన్న వ్యక్తులకు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. 8 గంటల సరైన నిద్ర
పోవాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News