Thursday, January 23, 2025

సమయానికి బైక్ సర్వీస్ చేయించకపోతే..?

- Advertisement -
- Advertisement -

కొత్త బైక్‌ను కొనుగోలు చేసినట్లయితే.. మొదటి సర్వీస్ ఎందుకు అవసరమో ఖచ్చితంగా తెలిసుండాలి. చాలా మంది మొదటి సర్వీస్‌ను సమయానికి చేయించడానికి మర్చిపోతున్నారు. ఒకవేళ కొత్త బైక్‌ను సమయానికి సర్వీస్ చేయకపోతే, అది ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో కొత్త బైక్ మొదటి సర్వీస్‌ను సమయానికి పూర్తి చేయకపోతే ఎదుర్కొనే సమస్యల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

 

కొత్త బైక్ మొదటి సర్వీస్ ఎప్పుడు చేయాలి?

కొత్త బైక్ కొనుగోలు చేసినప్పుడు, బైక్‌తో పాటు బుక్‌లెట్‌ను కూడా వస్తుంది. అందులో కొత్త బైక్ మొదటి సర్వీస్ ఎన్ని కిలోమీటర్లు చేయాలి అనే సమాచారం ఇస్తారు. కొత్త బైక్ మొదటి సర్వీస్‌ను 750 కిలో మీటర్లు, కొన్ని 1000 కిలోమీటర్ల వద్ద పూర్తి చేయాలని చాలా కంపెనీలు సిఫార్సు చేస్తున్నాయి. దీని ద్వారానే సర్వీస్ చేయించాలి.

సమయానికి సర్వీస్ చేయించకపోతే ఈ కింది సమస్యలు తలెత్తుతాయి

1. ఇంజిన్

ఎవరైనా కొత్త బైక్‌ను నిర్దేశించిన కిలోమీటర్ల వద్ద సర్వీస్ చేయించకపోతే, అది ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బైక్ ఇంజన్ కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. ఇంజిన్‌లో చిన్న చిన్న లోహపు రేణువులు ఉంటాయి. అవి బైక్ నడుస్తున్నప్పుడు రుద్దుతాయి. దాంతో ఇంజిన్ ఆయిల్‌తో కలుస్తాయి. బైక్ సకాలంలో సర్వీస్ చేయకపోతే ఇంజన్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2. పిస్టన్ దెబ్బతినవచ్చు

కొత్త బైక్ మొదటి సర్వీస్ సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చాలి. దీని వల్ల అందులో కనిపించే చిన్న చిన్న లోహ కణాలు బయటకు వస్తాయి. దీని వల్ల ఇంజిన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ అలా చేయకపోతే ఇంజిన్, పిస్టన్ ప్రతికూలంగా దెబ్బ తింటాయి. దీని కారణంగా పిస్టన్ కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా.. ఇంజిన్ దెబ్బతినే అవకాశం మరింత పెరుగుతుంది.

3. వారంటీ రద్దు

కొత్త బైక్ మొదటి సర్వీస్‌ను కంపెనీ పేర్కొన్న కిలోమీటర్ల వద్ద పూర్తి చేయకపోతే, ఏదైనా బైక్ భాగం దెబ్బతిన్నట్లయితే, కంపెనీ ఆ భాగం వారంటీని రద్దు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు.. కంపెనీ దీన్ని ఉచితంగా భర్తీ చేయడానికి నిరాకరించవచ్చు. కావున సరైన సమయంలో బైక్ ని సర్వీస్ చేయించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News