Sunday, January 19, 2025

చికాగో వీధులలో హైదరాబాద్ విద్యార్థిని: అప్పగించాలని తల్లి వేడుకోలు

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: అమెరికాలోని చికాగోలో రోడ్డుపై అత్యంత దీవాస్థలో జులైలో కనిపించిన హైదరాబాద్‌కు చెందిన సైదా లులూ మిన్హజ్ అనే విద్యార్థిని ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మీడియా కథనాల ప్రకారం ఆ విద్యార్థిని ఎవరి సహాయం తీసుకోవడానికి సంసిద్ధంగా లేదు. చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ ఆమె మాత్రం ప్రతిస్పందించడం లేదని తెలుస్తోంది.
అమెరికాకు వెళ్లే ముందు సైదా హైదరాబాద్‌లోని షాదాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని మౌలాలీలో ఆమె నివాసం.

డెట్రాయిట్‌లోని ట్రైన యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదివేందుకు ఆమె రెండేళ్ల క్రితం బయల్దేరి వెళ్లారు. ఆమెకు చెందిన వస్తువులన్నీ చోరీకి గురి కావడంతో జులైలో చికాగో వీధులలో అత్యంత దీనావస్థలో ఆమె కనిపించారు. ఆమె తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు కనపడ్డారు. సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వీడియోలో ఆమె మాటలాడలేని స్థితిలో అత్యంత నీరసంగా, దీనావస్థలో కనిపించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తల్లి సైదా వహాజ్ ఫాతీమా తక్షణమే స్పందిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. తన కుమార్తెను సాధ్యమైనంత త్వరితంగా భారత్‌కు తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే నెలరోజులు దాటినప్పటికీ సైదా మాత్రం స్వదేశానికి తిరిగిరాలేదు.

దీనిపై హైదరాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త మొహమ్మద్ రహీం ఖాన్ చికాగోలోని ఇండియన్ కాన్సులేట్‌కు లేఖ రాశారు. దీనికి అక్కడి ఇండియన్ కాన్సులేట్ స్పందిస్తూ తాము భారత్‌కు తిరిగివెళ్లడానికి తగిన సహాయం అందచేస్తామని పదేపదే తెలియచేసినప్పటికీ సైదా జైదీ మాత్రం స్పందించడం లేదని తెలిపింది.

ఆమెకు చట్టబద్ధమైన అమెరికా వీసా ఉన్నందున అమెరికాలో ఉండడమా లేక ఇండియాకు తిరిగిరావడమా అన్నది పూర్తిగా ఆమె సొంత నిర్ణయమని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News