Thursday, January 30, 2025

మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోడానికి బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోడానికి ఓ బాలిక ఏకంగా తన ప్రాణాలే తీసుకుంది. తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె తన ఇంట్లోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసిన తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఆమె తన ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది ? విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎంతో కాలంగా ఆత్మహత్య చేసుకునేందుకు బాలిక ప్రణాళిక వేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆన్‌లైన్ గేమింగ్‌కి కూడా బానిసగా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే ఆన్‌లైన్ నుంచి ఓ కత్తిని ఆర్డర్ చేసుకున్న బాలిక తొలుత తన చేతిని గాయపర్చుకుందని,అనంతరం మెడను కోసుకుని చనిపోయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News