Wednesday, December 25, 2024

మరణానంతరం ఆధార్ ఏమవుతుంది?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం జారీ చేసే అతి ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డు ఒకటి అని చెప్పవచ్చు. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర పథకం ప్రయోజనాల నుంచి బ్యాంక్ ఖాతా తెరిచే వరకు ఆధార్ చాలా ముఖ్యం. ఆధార్ తయారు చేసేటప్పుడు పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివిధ వివరాలను తీసుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన 12 అంకెల నంబర్ ఇస్తారు. కాగా, ఇది వ్యక్తికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే జారీ చేయబడుతుంది.

ఈ నేపథ్యంలో చనిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఏమవుతుంది? అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఆధార్ జారీ చేసే సంస్థ UIDAI దీని కోసం కొన్ని నియమాలను రూపొందించిందా? ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడానికి మార్గం ఏమిటి? అనే వివిధ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ అయిన UIDAI ఆధార్ తయారీకి సంబంధించి అనేక నిబంధనలను రూపొందిస్తుంది. అయితే, చనిపోయిన తర్వాత ఆధార్ కార్డుతో ఏమి చేయాలి? దీనికి సంబంధించి ఎలాంటి నియమం అయితే లేదు. ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ సరెండర్ లేదా మూసివేయాలని కోరుకుంటే, అలా చేయడం సాధ్యం కాదు అని UIDAI నిబంధనలు చెబుతున్నాయి. అయితే, మీరు దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి కేవలం ఆధార్ ని డిజిటల్ లాక్ చేయడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News