Friday, November 8, 2024

‘కాంగ్రెస్ చేసిందేంది?’ పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కల్లోలాలు, కన్నీళ్లు..
బిఆర్‌ఎస్ పాలనలో ప్రవహిస్తున్న జలప్రవాహాలు, ఇంటింటికి నల్లానీళ్లు
మీ ఓటు  విధ్వంసానికా? పునర్నిర్మాణానికా?
గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణను ధ్వంసం చేసింది కాంగ్రెస్ అని, తెలంగాణను పునర్నిర్మిస్తుంది బిఆర్‌ఎస్ అని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కల్లోలాలు, కన్నీళ్లు అని…బిఆర్‌ఎస్ పాలనలో ప్రవహిస్తున్న జలప్రవాహాలు, ఇంటింటికి నల్లానీళ్లు అని వారు వివరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలను ఓటుబ్యాంకుగా చూశారు తప్ప తెలంగాణను మానవసంపదగా మార్చలేదని ధ్వజమెత్తారు. తెలంగాణను ధ్వంసం చేసిన కాంగ్రెస్‌కు తెలంగాణను సుభిక్షం చేస్తున్న బిఆర్‌ఎస్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికల రణక్షేత్రంలో పునర్నిర్మాణదారి కెసిఆరే అజేయుడిగా నిలుస్తారని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండలంలోని పునరావాస గ్రామం బైలంపూరు కాలనీలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ములుగు మండల ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ పేర్యాల రవీంద్రరావు, డిసిసిబి డైరెక్టర్ పట్టు అంజిరెడ్డి, బిఆర్‌ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా, పిఏసిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్‌లు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన కెసిఆర్ ప్రసంగపాఠం “కాంగ్రెస్ చేసిందేంది?” అనే పుస్తకాన్ని ప్రజల మధ్యలో గురువారం నాడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ, ఒకప్పుడు గజ్వేల్‌కు ఉత్తరం రాస్తే గద్వాలకు పోయేదని చెప్పుకునేవారనీ, ఇప్పుడు అదే గజ్వేల్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వేగవంతమైన అభివృద్ధిని సొంతం చేసుకుందని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. గజ్వేల్ ఇప్పుడు కెజి టు పిజి విద్యకు నమూనా విద్యాకేంద్రంగా మారిందని పేర్కొన్నారు. గజ్వేల్ కేంద్రంలో రవీంద్రభారతి లాంటి సాహిత్య, సాంస్కృతిక కళాకేంద్రాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. గజ్వేల్ ఇప్పుడు రెవిన్యూ డివిజన్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటి గజ్వేల్ అభివృద్ధిని చూసి గత పాలకులతో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆనాటి గజ్వేల్‌ను తలచుకుని ఇప్పటి గజ్వేల్ అభివృద్ధిని చూస్తే పునర్నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందో తెలుస్తుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News