Saturday, December 21, 2024

రాజకీయం కోసం ఉప ఎన్నికలా?

- Advertisement -
- Advertisement -

పదవీ వ్యామోహమే బిజెపి లక్షం

తెలంగాణ కోసమే ఆనాడు త్యాగాలు చేశాం కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ
లేదు రేక్ పాయింట్ ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెదక్ ప్రజల చిరకాల వాంఛ రైలు రాకతో పాటు రేక్ పాయింట్ కూడా ప్రారంభిచుకోవడం చాలా సంతోషకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అన్నారు. సోమవారం నాడు మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ ప్రారంభించిన అనంతరం హరీశ్ మాట్లాడుతూ….గత ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. కేవలం అధికార వ్యామోహం తోనే నేడు బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టె ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఎన్నో త్యాగాలు చేశామని, పదవులను సైతం తృణపాయంగా వదులుకొన్నామని గుర్తుచేశారు. కానీ నేడు రాష్ట్రంలో బిజెపి పదవీ వ్యామోహం, అధికారపేక్ష తోనే ఉప ఎన్నిక మాట మాట్లాడుతున్నారని అన్నారు.

మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. ఎన్నో త్యాగలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. 40 సంవత్సరాల క్రితం ఎక్కడి పార్లమెంట్ మెంబర్ గా ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా కానీ అభివృద్ధి నేడు టిఆర్‌ఎస్ హయాంలో జరుగుతుందని ఆయన అన్నారు…ఏనాడు అధికార వ్యామోహం కోసం మేము పాటు పడలేదని, తెలంగాణ ఎక్కడి పరిపాలన ను ఆదరిస్తారని అన్నారు….అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అందుకే గతంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి నేడు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News