Thursday, January 23, 2025

పూర్తి కాని వంతేన.. మండల కేంద్రానికి రాని ఆర్టీసీ బస్సు

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: మండలంలోని సులుగుపల్లి, సలుగుపల్లి గ్రామాల సమీపంలోని తీగల ఓర్రేపై వంతేన నిర్మించినప్పటికి ఆప్రోచ్ పనులు పూర్తికాకపోవడంతో రహదారి అంత బురదమయంగా కావడంతో మండల కేంద్రానికి మూడు రోజులుగా అర్‌టిసి బస్సులు రావడం లేదు. వంతేన సమీపంలో తాత్కలిక రోడ్లు వేసినప్పటికి ఇటివల కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి కొట్టుకుపోవడంతో రహదారి అంత బురదమయంగా మారింది.

దీంతో కాగజ్‌నగర్ పెంచికల్‌పేట్ వయా వచ్చే అర్‌టిసి బస్సులు మూడు రోజులుగా మండల కేంద్రానికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రహదారి అంతా బురదమయంగా ఉండడంతో ద్విచక్ర వాహనాదారులు అదుపుతప్పి బురదలో పడిపోయి గాయాలైన సంఘటనలు కూడా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కాగజ్‌నగర్ పట్టణానికి వెళ్లాలంటే కౌటాల వయా సిర్పూర్ మీదుగా వెళ్లాలంటే అర్‌టిసి బస్సు చార్జీ 90 రూపాయలు అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి.

అదే పెంచికల్‌పేట్ మీదుగా అర్‌టిసి బస్సులో ప్రయాణం చేస్తే 70 రూపాయలతో కాగజ్‌నగర్ చేరుకోవచ్చు. అదనంగా 20 రూపాయలు చెల్లించి, అదనంగా దూరభారం ప్రయాణం చేయాల్సిన పరిస్థితిగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సులుగపల్లి వంతేన వద్ద అప్రోచ్‌పనులు పూర్తి చేసి రవాణ మెరుగుపరిచేలా చూడాలని, మండల కేంద్రానికి అర్‌టిసి బస్సులు వచ్చేలా చూడాలని మండల ప్రయాణికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News