Tuesday, April 1, 2025

రోజూ 5 బాదం పప్పులు తింటే..?

- Advertisement -
- Advertisement -

బాదం చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ, దాని తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. బాదంలో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ వర్గంలో ఉంచారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాని చాలా ప్రయోజనకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, ఇప్పుడు ప్రతిరోజూ 5 బాదం పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

1. బాదంపప్పులో విటమిన్ E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున ఇవి మెదడు పని సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా.. జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ బాదం పప్పులు తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2. బాదంపప్పులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3.బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోలేము.అంతేకాకుండా.. అనారోగ్యకరమైన చిరుతిండి అలవాటును కూడా తగ్గిస్తుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.

4. బాదంపప్పులో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. ముడతలను కూడా తగ్గిస్తాయి. అలాగే, ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తూ వాటిని బలంగా చేస్తుంది.

5. బాదం రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. బాదంపప్పులో ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. బాదం పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా బాదంపప్పులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 

నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News