Wednesday, January 22, 2025

ఓటేసిన స్లిప్ లభిస్తే ఎలా ఉంటుంది?

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రశ్నకు ఎన్నికల సంఘం వివరణ

న్యూఢిల్లీ:   ఓటరుకు ఓటింగ్ తర్వాత వివిపాట్ స్లిప్ లభించాలని, తర్వాత ఓటరు దానిని చూసి బ్యాలెట్ బాక్స్ లో వేసే అవకాశం ఉండాలని న్యాయవాది నిజామ్ పాషా అన్నారు. దానిపై న్యాయమూర్తి ఖన్నా ‘గోప్యత హననం జరగదా?’ అన్న ప్రశ్న లేవనెత్తారు.

ఎన్నికల సంఘం ఈవిఎం పై అనుమానాలను తొలగించే విధంగా వాదించింది. ఓటింగ్ కు ముందు ఓటింగ్ మిషన్లు అన్నింటితో మాక్ పోల్ జరుగుతుందని వివరించింది. ఇక పోటీ చేసే అభ్యర్థి ఏదేని ఐదు శాతం మిషన్లను చెక్ చేసుకోడానికి అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రతి మిషన్ కు వేర్వేరు పేపర్ల సీల్ ఉంటుంది. ఓట్ల లెక్కింపుకు మిషను వెళ్లినప్పుడు సీల్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తన ఓటు ఎటు వెళ్లిందని ఓటరు ఎలా చెక్ చేసుకోవచ్చునని కోర్టు ప్రశ్నించినప్పుడు అధికారి ఇందుకు తాము ఆయా సమయాలలో చైతన్య అభియాన్ నడుపుతుంటామని తెలిపారు. ఏ అసెంబ్లీకి ఏ ఈవిఎం మిషన్ వెళుతుందన్నది ముందస్తుగా నిర్ణయం కాదని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు ముగియగానే ఎవిఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్ లలో ఉంచడం జరుగుతుందన్నది. తర్వాత అభ్యర్థి వచ్చాకే కౌంటింగ్ రోజున రూమ్ ను తెరవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కోర్టు ‘ఓటరుకు స్లిప్ లభ్యం కాగలదా?’ అని ప్రశ్నించింది. దానికి ఎన్నికల సంఘం ‘ఇవ్వొచ్చు, కానీ దాని వల్ల ఓటు గోప్యత ఉల్లంఘనకు ఆస్కారం ఉంటుంది. దీనికి తోడు ఓటింగ్ స్లిప్ బూత్ వెలుపలకి చేరితే, ఓటరుకు కూడా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఆ స్లిప్ ను ఎలా ఉపయోగించుకుంటారనేది చెప్పలేం’ అని పేర్కొంది.

‘వివి పాట్ స్లిప్ లనే లెక్కించడం కుదరదా?’ అని కోర్టు ప్రశ్నించగా, ‘పేపర్ చాలా సన్నగా ఉంటుంది, అంటుకునేదిగా ఉంటుంది, వాటిని లెక్కించడం అంత సులభంగా ఉండదు’ అని వివరించింది. దానికి కోర్టు ‘ఓటింగ్ ప్రక్రియ అంతా నమ్మదగినదిగా ఉండాలి’ అని పేర్కొంది. దీనికి ఎన్నికల సంఘం ఈ సందర్భంగా ‘ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్’ జారీ చేస్తాం. ప్రతి ప్రశ్నకు అందులో జవాబు లభిస్తుంది’ అని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News