Monday, December 23, 2024

బిసిలకు ఇచ్చేది బిక్షం కాదు – రాజ్యాంగ హక్కు : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

బిసి బిల్లుకు ఢిల్లీలో భారీ ధర్నా

మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించక పోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరుగనివ్వమని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది బిసి నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఓట్లు బిసిలవి- సీట్లు అగ్రకులాలకా.. రాజ్యాధికారంలో వాటా కావాలి. -బిసిల వాటా బిసిలకు ఇవ్వాలి – బిసిలకు రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించాలని- అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బిసిలకు ఇచ్చేది బిక్షం కాదు – రాజ్యాంగ బద్దమైన హక్కు అని ఆయన హెచ్చరించారు.

బిసి బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని మిలిటెంట్ రూపంలో చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగి రాదన్నారు. కుల గణన చేయాలని కోరుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకపోవడం బిసి వ్యతిరేక వైఖరి కాదాయన్నారు. దేశంలోని 50 శాతం జనాభా గల బిసిలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా అణచివేస్తున్నారని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బిసిలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపించారు. బిసిలు పార్టీలపై, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ధర్నాలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, జి.అనంతయ్య, భుపేష్ సాగర్, వేముల రామకృష్ణ, బిసి వెంకట్, జక్కుల వంశీకృష్ణ, జక్కని సంజయ్, ఉదయ్, భాస్కర్ ప్రజాపతి, అరవింద్, యాదగిరి, లింగయ్య యాదవ్, రామూర్తి పాల్గొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News