Saturday, December 21, 2024

సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏమిటీ?… గుర్తించడం ఎలా?

- Advertisement -
- Advertisement -

నటి సమంత రుత్ ప్రభు చివరికి మనస్సు విప్పింది. తాను ఇటీవల మైయోసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతూ వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. తన రాబోయే చిత్రం ‘యశోద’ ట్రైలర్ కు ఫ్యాన్స్ చూపిన రెస్పాన్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.  మయోసైటిస్ అనేది ప్రధానంగా కండరాలపై ప్రభావం చూపించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బాధితులు కండరాల బలహీనత, నొప్పితో బాధపడతారు. ఎక్కువసేపు నిల్చుని ఉన్నా, నడిచినా త్వరగా అలసిపోవడం లేదా కళ్లు తిరిగి పడిపోతారు. మయోసైటిస్ వ్యాధి ఉన్నవారిలో ఇమ్యూనిటీ డిజార్డర్ తలెత్తి టిష్యూలపై నిరోధక శక్తి చూపుతోంది. మయోసైటిస్ పలు రకాలు ఉన్నాయి. ప్రధానంగా పాలిమయోసైటిస్, మయోసైటిస్ వ్యాధికి గురైనవారిలో తొడకండరాలు దెబ్బతింటాయి. సాధారణంగా 30నుంచి 60ఏళ్ల మధ్య ఉన్న వయస్సు ఉన్న మహిళలకు వస్తుంది. డెర్మామయోసైటిస్ బాధితుల కండరాలతో క్షీణతతోపాటు చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. ఇది మహిళలతోపాటు వచ్చే అవకాశం ఉంది. ఐబిఎం వచ్చినవారిలో తొడకండరాలు బలహీనత, ముంజేతి కండరాలు, మోకాళ్ల కింద కండరాలు బలహీనంగా మారిపోతాయి. దాటి న పురుషులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు.

Samantha

డెర్మాటో మయోసైటిస్ లక్షణాలు

పాలిమయోసైటిస్ లక్షణాలే ఎక్కువగా ఈ వ్యాధి బాధితులకు ఉంటాయి. అదనంగా దద్దుర్లు కూడా వస్తాయి. ముందుగా ఊదా, నల్లరంగుల్లో చర్మంపై దద్దుర్లు వస్తాయి. క్షీణత మొదలవుతుంది. సాధారణంగా కన్నురెప్పలు, ముక్కు, కణుపులపై దద్దుర్లు కనపడతాయి. మోచేతులు, మోకాళ్లపై ప్రభావం పడుతుంది. కాగా మయోసైటిస్ తీవ్రమైతే ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది మరింత ఎక్కువైతే రోగులు వైద్యులతో కమ్యూనికేట్ చేసేందుకు స్పీచ్ థెరపీ అందజేయాల్సి ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ ఇలా..

బాధితులు ఎదుర్కొంటున్న శారీరక సమస్యలను వైద్యు లు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మయోసైటిస్ బారిన పడ్డారని వైద్యులు భావిస్తే నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపరీక్ష ద్వారా స్థాయిని రక్తంలో ఉన్న యాంటీబాడీలను పరిశీలిస్తారు. శరీరంలోని కండరం శాంపిల్ తీసుకుని మార్పులు, జరిగిన నష్టాన్ని ఎంఆర్‌ఐ స్కానింగ్ నిర్వహించి ఫలితాన్ని సూదివంటి పరికరాన్ని ద్వారా కండరాల్లోకి పంపుతారు. బాధితుడికి నొప్పి తెలియకుండా పరీక్షించే కొంత శరీర భాగం మొద్దుబారిపోయేలా మత్తు ఇంజెక్షన్ చేస్తారు. కండరాల్లో నరాలు చివరిలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను రికార్డు చేసి విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తారు.

మయోసైటిస్‌కు వైద్యచికిత్స ఇలా..

Samantha lashes out Reporter asks relation with Chaitanya

అన్ని రకాల చికిత్సను అందించేటపుడు ప్రధానంగా వ్యాయామానికి రు. వ్యాయామం వల్ల కండరాలు వాపు తగ్గటంతోపాటు బలం చేకూరుతుంది. అదేవిధంగా కండరాలు ద్వారా బలోపేతం అవుతాయి. బాధితులుకు వ్యాయామంతోపాటు ఫిజియోథెరపీ చికిత్సలో భాగంగా అందిస్తారు. ఐబిఎం వచ్చినవారికి కేవలం మందులు వల్లే వ్యాధి నయంకాదు. జనరల్ ఫిజిషియన్‌తోపాటు యో థెరపిస్ట్ బాధితులు కోలుకునేందుకు తగిన వ్యా యామాలను సూచిస్తారు. అయితే వ్యాయా మం చేసేక్రమంలో బాధితులు జాగ్రత్తలు పాటించకపోతే మయోసైటిస్ లక్షణాలు మరింత పెరుగుతాయి. కండరాల నొప్పితోపాటు మారిపోతారు. ఈ దశలో నిపుణులు వ్యాయామం చే సేందుకు కూడా అనుమతించరు. మయోసైటిస్ బాధితులు సున్నితంగా కీళ్లు కదిలించాల్సి ఉంటుంది. కీళ్లు బిగుసుకుపోకుండా ఉంటాయి.

స్టెరాయిడ్లు వినియోగం

పాలిమయోసైటిస్, డెర్మాటోమయోసైటిస్ బాధితులకు చికిత్సలో భాగంగా వినియోగిస్తారు. దీంతో వారు త్వరగా వాపులు తగ్గటంతోపాటు నొప్పి నుంచి పొందుతారు. స్టెరాయిడ్లును ట్యాబ్లెట్లు లేదా రూపంలో ఇస్తారు లేదా ఒక్కోసారి నేరుగా నరాలకు ఇస్తారు.

పాలిమయోసైటిస్ లక్షణాలు

పాలిమయోసైటిస్ వచ్చినవారిలో మెడ, భుజాలు, పిరుదులు, తొడ కండరాలు బలహీనంగా మారిపోతాయి. బలహీనతతోపాటు నొప్పి కలుగుతుంది. బాధితులు ఎప్పుడు అలసటగా ఉంటారు. ఒక్కోసారి కళ్లుతిరిగి పడిపోతుంటారు. అనంతరం కూర్చోవడానికి, నిలబడటానికి ఇబ్బంది పడతారు. ఆహారం మింగేటప్పుడు ఎదుర్కొంటారు. ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతుంటారు. కుర్చీలోంచి లేవడం, మెట్లు ఎక్కడం, చిన్నవస్తువులు ఎత్తడం కూడా కష్టంగా ఉంటుంది. దువ్వుకునేందుకు కూడా భావిస్తుంటారు. ఈ వ్యాధి ముదిరితే కప్పును కూడా చేతితో ఎత్తడం కష్టంగా చికిత్స తీసుకోకపోతే రోజు రోజుకూ కండరాలు క్షీణించి ప్రమాదం ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News