Friday, December 20, 2024

పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?

- Advertisement -
- Advertisement -

KCR

న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం ఆపేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత ఆయన ఈ ధర్నా చేపట్టారు. పారబాయిల్డ్ బియ్యాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ. అయితే డిమాండ్ తక్కువ ఉన్నందున కొనలేమని కేంద్రం చెబుతోంది.

అసలు ‘పార్‌బాయిల్డ్ రైస్’ అంటే ఏమిటి?
నీళ్లలో పాక్షికంగా ఉడకబెట్టిన వడ్ల నుంచి తీసిన బియ్యమే ‘పారబాయిల్డ్ రైస్’. ఈ పార్‌బాయిల్డ్ రైస్ అనేది కొత్తదేమి కాదు. ప్రాచీన కాలం నుంచి వస్తున్నదే. అయితే పారబాయిల్డ్ రైస్‌కు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేక ఆహార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిర్వచనం అంటూ ఏదీ లేదు. కాగా పారబాయిల్డ్ విధానాలు నేడు అనేకం ఉన్నాయి. మైసూరులోని సిఎఫ్‌టిఆర్‌ఐ పద్ధతిలో వడ్లను నీళ్లలో మూడు గంటలు నానబెట్టి స్టీమ్ చేయడం జరుగుతుంది. ఇక తంజావూరులో పిపిఆర్‌సి పద్ధతి ఉంది. దీనిని క్రొమేట్ ప్రాసెసింగ్ అని కూడా అంటారు. క్రొమెట్‌ను ఉపయోగించడం ద్వారా వారు తడి బియ్యం నుంచి వాసనను తొలగిస్తారు. అన్ని విధానాల్లో మూడు దశలు ఉంటాయి. నానబెట్టడం, స్టీమింగ్, డ్రయింగ్ అనేవి. ఆ తర్వాత ఆ పాడి మిల్లింగ్‌కు వెళుతుంది. అన్ని రకాల వడ్లను పారబాయిల్డ్ రైస్‌గా ప్రాసెస్ చేయొచ్చు. అయితే సువాసన రకాలను పారబాయిల్డ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాటి సువాసన పోతుంది. పారబాయిల్డ్ ప్రాసెసింగ్ వల్ల మేలు, కీడు రెండూ ఉన్నాయి.

 

ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏప్రిల్ 1, 2022 నాటికి మొత్తం నిల్వ బియ్యం 40.58 లక్షల మెట్రిక్ టన్నులు (LMT) ఉంది. ఇందులో అత్యధికంగా తెలంగాణలో 16.52 LMT, తమిళనాడు (12.09 LMT) మరియు తరువాతి స్థానంలో ఉంది. కేరళ (3 LMT). ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, పంజాబ్ మరియు హర్యానా వంటి 10 ఇతర రాష్ట్రాలలో స్టాక్ 0.04–2.92 LMT పరిధిలో ఉంది.

2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్ (కెఎంఎస్) కోసం కేంద్రం తెలంగాణ నుండి 1.36 ఎల్‌ఎమ్‌టి పారబాయిల్డ్ బియ్యాన్ని సేకరించనుంది. కొనసాగుతున్న KMS 2021-22 కోసం, జార్ఖండ్ (3.74LM) మరియు ఒడిశా (2.08 LMT) నుండి మాత్రమే 5.82 LMT పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని కేంద్రం భావిస్తోంది. తెలంగాణతో సహా ఇతర 10 బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుండి, మినిస్ట్రీకి పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించే ప్రణాళిక లేదు. రాబోయే రోజుల్లో, మొత్తం ఉప్పుడు బియ్యం నిల్వ 47.76 LMTలకు పెరుగుతుంది

Paraboiled rice stock

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News