Monday, January 20, 2025

గ్రూప్ 1 నోటిఫికేషన్…. రెండు నెలలు ఆలస్యం అయితే ఇబ్బంది ఏంటి..?

- Advertisement -
- Advertisement -

60 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకు

గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు పరీక్షలు వాయిదా వేయాలి
రెండు నెలలు ఆలస్యం అయితే ఇబ్బంది ఏంటి..?
బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి మొండితనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి అత్తెసరు చదువు చదువుకున్నారని, టిజిపిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ అని, ఇద్దరూ కలిసి గ్రూప్ 1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఒ 29తో బిపి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్‌కు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులను ఎందుకు కలవరని ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, 60 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు.

28,150 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి కలిసి తప్పుడు జిఒను తీసుకువచ్చారని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి ఎవరి కోసం హడావిడిగా పరీక్షలు పెడుతున్నారని అడిగారు. ఎన్‌టిఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్పోడు కాదు అని, ఇచ్చిన జిఒను ఎన్‌టిఆర్ 24 గంటల్లో వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు జిఒను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. రెండు నెలలు ఆలస్యం అయితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏంటి..? అని ప్రశ్నించారు. జిఒ 55 అన్ని వర్గాలకు న్యాయం చేసే జిఒ అని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేదల జీవితాన్ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల సమస్యను బండి సంజయ్ తప్పుదోవ పెట్టించారని పేర్కొన్నారు. బిసి సిఐను బండి సంజయ్ ట్రాన్స్‌ఫర్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఈటెల రాజేందర్ హైలెట్ అవుతారని బండి సంజయ్ రోడ్డు ఎక్కారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News