Sunday, January 19, 2025

ప్రపంచ కప్ ఎత్తుకున్నప్పుడు మెస్సీ నల్ల వస్త్రం ఎందుకేసుకున్నాడు?!

- Advertisement -
- Advertisement -

ఖతార్: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకున్నాక ఆ కప్పును తన టీమ్ మేట్లతో కలిసి ఎత్తుకుని కనిపించాడు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ. కానీ ఆ సమయంలో అతడు అర్జెంటీనా ఐకానిక్ జెర్సీపైన నల్ల వస్త్రం వేసుకుని కనిపించాడు. ఎందుకిలా?…అని వివరాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ట్రోఫీని ప్రదానం చేయడానికి ముందు దానిని వేసుకోమని కోరాడట. ఆ నల్లని వస్త్రాన్ని ‘బిష్త్’ అంటారు. దానిని ఒంటె వెంట్రుకలు, గొర్రె బొచ్చుతో నేస్తారు. అరబ్బు జగత్తులో ఏదేని ప్రత్యేక సందర్భంలో దానిని ధరించడం పరిపాటి. సాధారణంగా అరబ్బు జగత్తులో రాజవంశస్తులు, మత నాయకులు దానిని ధరిస్తుంటారు. కానీ ప్రపంచ సాకర్ కప్‌ను అందుకునేప్పుడు మెస్సీ దానిని ధరించారన్నది ఇక్కడ గమనార్హం.

లియోనెల్ మెస్సీ ఈ తరం మేటి ఫుట్‌బాలర్. అతడి ఖ్యాతి చరిత్రలో లిఖించబడుతుంది. ‘బిష్త్ ’ వస్త్రాన్ని ధరించిన ప్రఖ్యాత వ్యక్తిగా అతడు చరిత్రలో నిలిచిపోనున్నాడు. మెస్సీ బిష్త్ ధరించి ఉన్నప్పుడు అమీర్ ప్రక్కన, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News