Monday, January 20, 2025

కర్నాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ నేతలకు లింకేంటి?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటకలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర, నేతలు, వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కర్నాటక ఎస్‌టి కార్పొరేషన్ నుంచి తెలంగాణకు రూ.45 కోట్లు బదిలీ చేశారని తన ట్విట్టర్‌లో కెటిఆర్ పోస్టు చేశారు. పార్లమెంటు ఎన్నికల ముందు 45 కోట్ల రూపాయల నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల యజమానులు ఎవరు అని అడిగారు. బార్లు, బంగారు దుకాణాల యజమానులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తొమ్మిది మంది బ్యాంకు ఖాతాలకు కర్నాటక నుంచి నగదు బదిలీ జరిగిందని, ఈ కుంభకోణం గురంచి సిటి, సిఐడి, ఇడి సోదాలు చేసిందని, కానీ వార్తలు బయటకు రాకుండా అణచివేశారని కెటిఆర్ మండిపడ్డారు.

కర్నాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.90 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారని, సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్నాటక మంత్రి ఆరోపణలు చేసిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్నాటక మంత్రి సతీష్ జారా కిహోలీ ఎందుకు అన్నారని నిలదీశారు. రూ.90 కోట్ల అవినీతి గురించి సిఎం మాట్లాడిన దానిపై ఇడి ఎందుకు మౌనంగా ఉందని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని కెటిఆర్ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News