- Advertisement -
ధ్రువ సుడిగుండం గంటకు దాదాపు 155 మైళ్ల (250 కిమీ) వేగంతో ఉత్తర ధ్రువం చుట్లూ అపసవ్య దిశలో తిరుగుతుంటుంది. రెండు రకాల ధ్రువ సుడిగుండాలు ఉన్నాయి. ఒకటి చైతన్యావరణం (ట్రోపోస్ఫిరిక్), రెండవది ఆస్తరావరణం(స్ట్రాటోస్ఫిరిక్). చైతన్యావరణ ధ్రువ సుడిగుండం వాతావరణం అట్టుడుగు అంచెలో సంభవిస్తుంటుంది. చాలా వరకు వాతావరణ మార్పులు అక్కడే చోటు చేసుకుంటుంటాయి. ఇది ఉత్తర అక్షాంశాల వ్యాప్తంగా మృదు వాతావరణాన్ని సృష్టిస్తుంటుంది. ఉత్తరార్ధగోళంలో మధ్య భాగం నుంచి ఎత్తైన అక్షాంశాల్లో గల దేశాలపై ధ్రువ సుడిగుండం ప్రధానంగా ప్రభావం చూపుతుంటుంది. ఆ ప్రాంతాలు ముఖ్యంగా అత్యంత శీతల వాతావరణ ఘటనలకు దారి తీస్తుంటాయి.
- Advertisement -