హసన్పర్తి: అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సిద్ధాపూర్, కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జి తిరుపతి ఏర్పాటుచేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మండలాధ్యక్షుడు పోరెడ్డి మహేందర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగళ్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నమిండ్ల శ్రీనివాస్ ఆదేశాల మేరకు చేరికల కార్యక్రమం నిర్వహించామన్నారు.
కాగా సిద్ధాపూర్, కొత్తపల్లి గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం సిద్ధాపూర్, బైరాన్పల్లి గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, లక్ష్మణ్, రమేశ్, రాజేందర్, సాంబ య్య, రవి, ప్రభాకర్, రాజిరెడ్డి, రవి, కుమారస్వామి, అనిల్, రామకృష్ణ, శంకర్, రాజిరెడ్డి, మొగిలి, సురేష్, కృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.