న్యూఢిల్లీ: ఒమిక్రాన్ లోని రెండు సబ్ వెర్షన్లు బీఏ 1, బీఏ 2 కలిసి ఎక్స్ ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా బ్రిటన్‌లో ఈ వేరియంట్ బయటపడింది. తరువాత అనేక దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ కంటే దీని వ్యాప్తి వేగం 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండక పోవచ్చని సమాచారం. దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న సమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్‌ఈ ’ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబైలో ఈ రకం కేసు బయటపడినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ లోనూ తొలి ఒమిక్రాన్ ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇది కచ్చితంగా ఎక్స్ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఎక్స్‌ఈ వేరియంట్ సోకినట్టుగా భావిస్తోన్న వ్యక్తి నమూనాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడీసీ)కు పంపినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
‘ఎక్స్‌ఈ’ వేరియంట్ అంటే…
- Advertisement -
- Advertisement -
- Advertisement -