Tuesday, December 24, 2024

ఆన్‌లైన్ గేమ్ ఎలాంటి ప్రభావం చూపింది?

- Advertisement -
- Advertisement -

కొన్ని ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన యువతరంలో ఎలాంటి దుష్పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయన్న అంశాన్ని ప్రధాన కథావస్తువుగా తీసుకొని ‘రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్’ చిత్రాన్ని రూపొందించారు. రాకేష్, మహి, రవి, సిరి, రుచిత, వెన్నెల, రంగస్థలం లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా సూర్యచక్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో డి.మహేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమా ర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత డి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ “ఓ గ్రామంలోని నలుగురు యువకులపై ఆన్‌లైన్ గేమ్ ఎలాంటి ప్రభావం చూపింది? వారి కుటుంబాలలో ఎలాంటి అలజడి జరిగింది, తర్వాత వారిలో ఎలాంటి మార్పు వచ్చింది? అన్న అంశం తో ఈ చిత్రాన్ని మలిచాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు గనిరెడ్డి, ప్రధాన పాత్రధారులు రాకేష్, రవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News