Monday, January 20, 2025

ఆందోళనతో జీవిస్తున్న పట్టణ వాసులు

- Advertisement -
- Advertisement -

What worries the world

ప్యారిస్(ఫ్రాన్స్):  నేడు నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం వంటి వివిధ అంశాల కారణంగా పట్టణ భారతీయు ఆందోళనతో జీవిస్తున్నారు. ఈ విషయం ఐపిఎస్‌ఓఎస్(IPSOS) సర్వేలో తేలింది. ప్రతి పది మందిలో ఇద్దరు భారతీయులు ద్రవ్యోల్బణంతో ఆందోళన చెందున్నారని ఐపిఎస్‌ఓఎస్ సర్వే ‘వాట్ వర్రీస్ ది వరల్డ్’ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పౌరులను ఆందోళనకు గురిచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్ సరైన దిశలోనే పయనిస్తున్నట్లు 76 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో సౌదీ అరేబియా ముందు వరుసలో నిలిచింది. తమ దేశం సరైన దిశలోనే పయనిస్తున్నట్లు ఆ దేశవాసులు పేర్కొన్నారు. ఐపిఎస్‌ఓఎస్ ఈ సర్వేను ఆన్‌లైన్ ప్యానల్ సిస్టం ద్వారా సెప్టెంబర్‌అక్టోబర్ మధ్య చేపట్టింది. ‘వాట్ వర్రీస్ ది వరల్డ్ ’ సర్వే ఆయా దేశాల్లో అత్యంత ముఖ్యమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News