Thursday, January 23, 2025

మనసుని హత్తుకునే మెలోడీ

- Advertisement -
- Advertisement -

 

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీగా కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటని చాలా గ్రేస్‌ఫుల్‌గా కోరియోగ్రఫీ చేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ స్టయిలిష్‌గా ఆకట్టుకున్నాయి. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్య బెహరా, భార్గవి పిళ్లై తమ వాయిస్‌తో మైమరపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News