- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర సర్కార్ తాజాగా తీసుకొచ్చిన ఐటి నిబంధనలు అమలు చేస్తే.. తన వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ వాదిస్తోంది. ఈ కొత్త రూల్స్ తమ విధానాలకు విరుద్ధమంటూ కోర్టుకు తెలియజేయనుంది. కేంద్రం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిబంధనలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ వీటిని అంగీకరిస్తున్నట్టు తెలిపింది. భారత్ లో వాట్సాప్‌కు 400 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
WhatsApp approached Delhi High Court
- Advertisement -