Saturday, November 16, 2024

గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు కాదు

- Advertisement -
- Advertisement -

WhatsApp group admin not liable for content posted by members

వాట్సాప్ లో నేరపూరిత సమాచారంపై బొంబాయి హైకోర్టు తీర్పు

ముంబయి : వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల విషయంలో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన, నేరపూరితమైన సమాచారం పంపితే అందుకు గ్రూప్ అడ్మిన్ జవాబుదారీ కాదని బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసుకు విషయంలో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులకు దానిపై పరిమిత నియంత్రణ ఉందని కోర్టు పేర్కొంది. వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు కేవలం కొత్త సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు కానీ, గ్రూపులో పోస్ట్ చేసిన కంటెంట్‌ను నియంత్రించలేరు లేదా సెన్సార్ చేయలేరు అని తెలిపింది. కిశోర్ తరోన్ పై 2016లో గోండియా జిల్లాలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అడ్మిన్‌గా ఉన్న తరోన్‌పై వాట్సాప్ గ్రూపు సభ్యుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో విఫలమయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News