Saturday, November 16, 2024

డీప్‌ఫేక్‌పై త్వరలో వాట్సాప్ హెల్ప్‌లైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించిన తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను నియంత్రించడానికి వాట్సాప్ త్వరలో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనుంది. దీని కోసం వాట్సాప్ మాతృ సంస్థ మెటా మిస్‌ఇన్ఫర్మేషన్ కొంబాట్ అలయన్స్ (ఎంసిఎ)తో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ హెల్ప్‌లైన్ చాట్‌బాట్ రూపంలో ఉంటుంది, ఇది ఇంగ్లీష్‌తో పాటు మూడు స్థానిక భాషలలో (హిందీ, తమిళం, తెలుగు) ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎంసిఎ ‘డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్’ను ఏర్పాటు చేస్తుంది. ఎంసిఎ వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను విశ్లేషించడానికి సెంట్రల్ ‘డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్’ని ఏర్పాటు చేస్తుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆపడానికి డిఎయు అవసరం అని మెటాలోని పబ్లిక్ పాలసీ ఇండియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు. ఎఐ ద్వారా ఉత్పన్నమయ్యే తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆపడానికి డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్(డిఎయు) అవసరమని ఎంసిఎ చైర్మన్ భరత్ గుప్తా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News