Thursday, December 19, 2024

తప్పుడు సమాచారానికి చెక్

- Advertisement -
- Advertisement -

‘చెక్ ది ఫ్యాక్ట్’ ప్రచారం ప్రారంభించిన వాట్సాప్

న్యూఢిల్లీ : వాట్సాప్‌లో ఒక రకమైన తప్పుడు సమాచారం పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతున్న అబద్ధాలను ఆపడానికి, కంపెనీ ‘చెక్ ది ఫ్యాక్ట్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వాట్సాప్ భద్రతా ఫీచర్ గురించి వినియోగదారులకు తెలియజేస్తోంది. తద్వారా వారు మోసాల గురించి అప్రమత్తంగా ఉంటారు. అలాగే, ఇది నకిలీ వార్తలను అరికట్టడంలో సహాయపడుతుంది.

వాట్సాప్ సందేశాన్ని ఫార్వార్డ్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలని వాట్సాప్ వినియోగదారులకు సలహా ఇస్తోంది. ఫార్వర్డ్ మెసేజ్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాలని వాట్సాప్ చెబుతోంది. సందేశానికి డబుల్ రైట్ సిగ్నల్ ఉంటే, అది చాలాసార్లు ఫార్వార్డ్ అయిందని అర్థం, ఫార్వార్డ్ మెసేజ్ లెవల్‌తో 5 మందికి సందేశాలను పంపగలరు. అలాగే అనుమానాస్పద ఖాతాలను బ్లాక్ చేయాలి. అనుమానాస్పద ఖాతాను చూసినట్లయితే లేదా సందేశం ప్రమాదకరమని భావిస్తే, చేయాల్సిన మొదటి పని ఆ ఖాతాను బ్లాక్ చేయడం, దాని గురించి రిపోర్ట్ కూడా చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News