Tuesday, November 5, 2024

వాట్సాప్ వేదికగా దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన

- Advertisement -
- Advertisement -

WhatsApp Platform Cyber ​​Security Violation In Country Army

న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాలు మంగళవారం ఆందోళనకరమైన విషయాన్ని గుర్తించాయి. దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్టు వెల్లడించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. “ కొంతమంది సైనికాధికారుల ప్రమేయం ఉన్న సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనను నిఘా వర్గాలు, సైన్యం గుర్తించాయి. ఇది పొరుగుదేశాల గూఢచర్య కార్యకలాపాలతో ముడిపడి ఉండొచ్చు. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగా ఈ ఉల్లంఘన జరిగింది.” అని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని , దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవని పేర్కొన్నాయి.

కేసు సున్నితత్వం కారణంగా మరిన్నివివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే ఎటువంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని అభ్యర్థించారు. ఇటీవల కాలంలో మనసైన్యం కార్యకలాపాలను తెలుసుకునేందుకు అనుమానిత పాక్, చైనా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం మన అధికారుల నుంచి సున్నిత సమాచారాన్ని పొందేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నాయి. శత్రుదేశాల ప్రయత్నాలు చాలావరకు విఫలమైనా వీరి ఉచ్చులో పడిన కొందరు అధికారుల నుంచి కొంత సమాచారం పొందినట్టు తెలుస్తోంది. ఈ తరహా కేసుల్ని అరికట్టేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మార్గదర్శకాలను అనుసరించాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News