Friday, November 15, 2024

పాక్ రిపబ్లిక్ డే సందేశం.. కర్నాటక యువతి అరెస్టు, విడుదల

- Advertisement -
- Advertisement -

 

WhatsApp post on Pakistan’s Republic Day lands karnataka woman in jail

 

బెంగళూరు : పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ సందేశం వెలువరించిన పాతికేళ్ల ముస్లిం యువతిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీన పాకిస్థాన్ రిపబ్లిక్ డే ఉంది. కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లా ముధోల్‌కు చెందిన ఈ యువతి కుత్మా షేక్ ప్రతిదేశానికి శాంతి ఐక్యత సామరస్యం కలిగేలా దేవుడు దయచూపాలని సందేశం వెలువరించింది. అయితే దేశంలోని ఇరు వర్గాల మధ్య వైషమ్యాల చిచ్చుకు ఈ సందేశంతో పాకిస్థాన్ రిపబ్లిక్ డే నేపథ్యంలో ఈ యువతి యత్నించిందని పేర్కొంటూ అరుణ్‌కుమార్ భజంత్రి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టుకు దిగారు. యువతి ఓ మదర్సాలో సీనియర్ విద్యార్థిగా ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన మరుసటి రోజు ఈ యువతి బెయిల్‌పై విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News