- Advertisement -
మెటా నిర్వహణలోని వాట్సప్ యాప్ వ్యాపార సేవలను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. హైదరాబాద్ మెట్రో సహా ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో రైలు టిక్కెట్లను విక్రయిస్తున్న వాట్సప్ త్వరలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లనూ అందజేసేందుకు సిద్ధం అవుతోంది. ఇందు నిమిత్తం ఐఆర్‌సిటిసితో చర్చలు జరుపుతున్నట్లు మెటా డైరెక్టర్ (బిజినెస్ మెసేజింగ్) రవి గార్గ్ తెలియజేశారు. క్రమంగా ఈ సేవలను వివిధ రాష్ట్రాల బస్సు సర్వీసులకూ విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. వాట్సప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో పాటు చిన్న చిన్న వ్యాపార సంస్థలకూ కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత ప్రత్యేక సేవలు అందజేయనున్నట్లు గార్గ్ తెలియజేశారు. చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ప్రకటనలు, ప్రచార రూపకల్పనలో తమ ఎఐ ఆధారిత అసిస్టెంట్లు, ఏజెన్సీల ద్వారా ఉచితంగా తోడ్పడనున్నట్లు గార్గ్ తెలిపారు.
- Advertisement -