Monday, December 23, 2024

పత్తి రైతుల కోసం వాట్సాప్ సేవలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి రైతుల సౌకర్యార్థం వాట్స్ యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి. పత్తి కొనుగోలు సంబంధిత సేవలు 88972 81111 వాట్స్ యాప్ నెంబర్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభించారు. పత్తి రైతులు, పత్తి కొనుగోలు సంబంధిత సే వలు అంటే రైతు పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉం డే సమయం, కొనుగోలు వివరాలు వంటి అంశాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్స్ యాప్ చాట్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. పింజ రక ము ఒక క్వింటాలుకు

రూ.7521, (పింజ పొడువు (మి.మీ)29.5 నుండి 30.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.3) గా, పింజ రకము ఒక క్వింటాలుకు రూ.7471,(పింజపొడువు (మి.మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము ఒక క్వింటాలుకు రూ.7421, పింజ పొడువు (మి. మీ) 27.05 నుండి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7 గా పత్తికి కనీసం మద్దతు ధ ర ప్రభుత్వం ప్రకటించారు. పత్తిలో తేమ 12 శాతం మించకుండా ఉండి, 8శాతం నుండి 12శాతం మ ధ్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. తే మ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్థారించుకున్న త ర్వాతనే ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాల వద్ద అమ్ముకోవాలని మంత్రి సూచించారు.

ఈ పత్తి సీజన్‌లో రైతు లు వారి పత్తిని సులభంగా విక్రయించేందుకు మా ర్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని, రైతులం తా మార్కెటింగ్ శాఖ తీసుకువచ్చిన వాట్స్ యాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుం డా పత్తిని అమ్ముకోవాలని మంత్రి రైతులని కోరా రు. రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా కూడా ఈ వాట్సాప్ చాట్ ద్వారా తెలిపితే మార్కెటింగ్ శాఖ సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News