లాయర్ వెలువరించిన ఓ సాక్ష్యం
న్యూఢిల్టీ : టిఆర్పి స్కామ్ కేసుకు సంబంధించి ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఓ వాట్సాప్ వీడియో సంభాషణలోని భాగాలను వెలువరించారు. రిపబ్లిక్ టీవీ కార్యనిర్వాహక సంపాదకులు అర్నబ్ గోస్వామి , బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసర్చ్ కౌన్సిల్ ( బార్క్) మాజీ సిఇఒ పార్థోదాస్గుప్తా మాట్లాడుకున్నట్లుగా ఈ లీకైన వాట్సాప్ ఆధారం ఉందని, వీటిని తన ట్విట్టర్లో షేర్ చేస్తున్నాని లాయర్ తెలిపారు. కేసులో దాస్‌గుప్తా నిందితుడుగా ఉన్నారు. వాట్సాప్ ఛాట్‌కు సంబంధించి తనకు లభ్యమైన సంభాషణలోని భాగాలు ఇవేనని , వీటిని బట్టి పలు కుట్రలు జరిగాయని వెల్లడవుతోందని, ఈ ప్రభుత్వంలోని అధికారిక కేంద్రాలతో ఈ స్కామ్‌కు లింక్లున్నట్లు తేలుతోందని లాయర్ వ్యాఖ్యానించారు. మంత్రులంతా తనవైపు ఉన్నారని, అర్నబ్ చెపుతున్నట్లుగా ఉందని ప్రశాంత్ చెప్పారు. దేశంలో చట్టపరమైన పాలన అంటూ ఉంటే సదరు వ్యక్తి చాలా కాలం జైలు కావల్సిందే అన్నారు. తానైతే ఈ వాట్సాప్ లీక్నుజతచేస్తున్నట్లు వివరించారు.