Monday, December 23, 2024

రైతుబంధు ఎప్పుడిస్తారు?

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 9వ తేదీనే జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు..
ఏవి నిధులు? రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ మెల్లగా విమర్శలు షురూ చేస్తోం ది. రైతు బంధు స్కీమ్ నిధుల పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు ఇస్తా మని చెప్పారు, వడ్లు అమ్ముకోవ ద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొం టామని రైతులకు చెప్పారు, రైతు బంధు పెంచుతామని హామీ ఇ చ్చారు. మరీ ఎన్నికల్లో హామీ ఇ చ్చినట్లుగా రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు ఎప్పుడూ కొంటారు, పెంచిన రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని హరీశ్‌రావు అ సెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన ని లబడతామని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణ యం కోసం వేచి చూ స్తోందన్నా రు. తుపాన్ కారణంగా కొ న్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారం లోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ తేదీ వచ్చి వెళ్లిపోతున్నదని, మరి రైతుబంధు ఎప్పుడు ఇస్తారని అన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సిఎం సమీక్షించాకే చెల్లింపులు

రైతుబంధు పథకం నిబంధనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తాం. మాది రైతు ప్రభుత్వం. అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తాం.
– సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News