Tuesday, December 24, 2024

మేడిగడ్డు కాలం గడిచేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

రాజకీయాలకు కేంద్ర బిందువుగా బ్యారేజీ

మనతెలంగాణ/హైదరాబాద్:  ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ను గోదావరి నదీజలాలతో సస్యశ్యామలం చేస్తూ ఏటా రెండు సీజన్లలో వ్యవసాయపనులపైనే ఆధారపడ్డ లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ గత నాలుగేళ్లుగా మేడిగడ్డ బ్యారేజి జీవగడ్డగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ఈ భారీ బ్యారేజ్ కం రిజర్వాయర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో అధికార విపక్షపార్టీల మధ్యన విమర్శల యుద్ధానికి కారణమైంది. నీటిపారుదల రంగంలో కాక లు తీరిన నిపుణులకే కాకుండా, అధునాతన సాం కేతిక రంగంలో నిష్ణాతులైన వారికి సరికొత్త సవా ళ్లు విసురుతోంది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర జలసంఘం ముందు ప్రశ్నార్ధకంగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్భాగంగా, మొత్తం ప్రాజెక్టుకే గుండెకాయలా నిలిచిన మేడిగడ్డ బ్యారేజి కుంగు బాటు సాంకేతిక తప్పదమా, లేక ప్రకృతి వైపరీత్యమా, నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపమా, లేక నీటిపారుదలరంగంలో అధికార యంత్రాం గం బాధ్యతారాహిత్యమా, క్వాలిటి కంట్రోల్ వ్యవస్థలో పరీక్షల విఫలమా ప్రశ్నల పరంపరలు పుట్టుకొస్తున్నాయి. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న ప్రాణహిత నది గోదావరినదిలో కలిసే ప్రాంతానికి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టుకంతటికీ 160టిఎంసీల నీటిని అందించాలన్న లక్షంతో మేడిగడ్డ బ్యారేజిని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం కింద మొత్తం 18లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇప్పటికే ఈ ప్రాజెక్టుపైన 94వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. సవరించిన అంచానాలమేరకు ప్రాజెక్టు వ్యయం రూ.1.27 లక్షల కోట్లుదాటింది. ప్రాజెక్టులో ప్రధానకాంపోనెట్లు , డిస్ట్రిబ్యూటరీలు, పంటపొలాలకు నీరందించే పిల్లకాలువలు (ఫీల్డ్ చానల్స్) తదితర మిగులు పనులన్ని పూర్తయ్యేనాటికి కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తునారు.
వ్యయం స్వల్పం.. ప్రయోజం అధికం!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంపై ప్రభుత్వం చేసిన వ్యయం స్వల్పమే అయినా ఈ బ్యారేజి ద్వారా ప్రయోజనం మా త్రం అత్యధికంగా ఉంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంతో పోలిస్తే మేడిగడ్డ వ్యయం 2శాతం మించటం లేదు. గో దావరి నదిగర్భంలో 89మీటర్ల బెడ్ స్థాయిలో 84గేట్లతో నిర్మించిన ఈ బ్యారేజిలో మొత్తం నీటి నిలువ సామర్ధం 16.17టిఎంసీలు. ఈ బ్యారేజి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థకంతటికీ అవసరమైన 180టిఎంసీల నీటి ఎత్తిపోత జరుగుతుంది. 2019నవంబర్ 21న బ్యారేజి నిర్మాణం పూర్తి కావటంతో తొలిసారిగా బ్యారేజి గేట్లన్ని మూసివేశారు. 2020 ఫిబ్రవరి 17 తొలిసారి బ్యారేజిలో పూర్తి స్థాయి సామర్ధం మేరకు నీటిని నిలువ చేశారు. 2022జులై 9న గోదావరి నదికి వచ్చిన భారీ వరదలోనూ బ్యారేజి చెక్కుచెదరలేదు. ఎగువ నుంచి 2. 66లక్షల క్యూసెక్కుల వరద రాగా బ్యారేజిలోని 57గేట్లు ఎత్తివేసి 4లక్షల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు వదిలారు. కారణాలు ఏమైనప్పటికీ దురదృష్టవశాత్తు 2023అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజి పగుళ్లు ఇచ్చి తెలంగాణ గుండే పగిలేలా ప్రతిధ్వనించింది. బ్యా రేజి ఏడవ బ్లాకు పరిధిలోని 20వ పిల్లర్ గోదావరి నదిగర్భంలోకి కుంగిపోయింది. ఎదమవైపునకు ఒరిగిపోయింది. 21వ పిల్లర్ సగానికి రెండు భాగాలుగా నిలువునా చీలి పోయింది. 22వ పిల్లర్ దెబ్బతింది. 18వ పిల్ల ర్ కిందిభాగం నుంచి నీరు ఉబికి వస్తోంది. భారి ప్రమా దం నుంచి మేడిగడ్డ బ్యారేజిని కాపాడేందుకు గేట్లు ఎత్తివేసి బ్యారేజిలో నిలువ నీటినంతా దిగువకు వదిలేశారు. మేడిగడ్డ బ్యారేజిలో నిలువ చేసిని నీటిని ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజిలలోకి ఎతిపోసే భారీ మోటా ర్లు మూగబోయాయి.
మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం నిలుస్తుందా!
మేడిగడ్డ బ్యారేజి ఉపయోగంలో లేకపోతే మొత్తం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అస్థిత్వమే కోల్పోవాల్సిన ప్ర మాదం ఏర్పడింది. బ్యారేజిని ఎదో విధంగా కాపాడుకోకపోతే ఎగువన ఉన్న అన్నారం , సుందిళ్ల బ్యారేజిలు కూ డా ప్రాణహిత వరద జలాలు అందక వృధాపోనున్నా యి. వేలకోలది మెగావాట్ల సామర్దంతో పంప్‌హైస్‌లలో ఏర్పాటు చేసిన భారీ మోటార్లు తుప్పు పట్టిపోవాల్సివస్తుంది. కాలువలు నీటిపారకం లేక పిచ్చిమొక్కలు మొలి సి కాలువల రూపురేఖలనే మార్చివేస్తాయంటున్నారు. ఇంతటి ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్న మోడిగడ్డ బ్యారేజిని ఏదోవిధంగా వినియోగంలోకి తెచ్చుకోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ నీటితో ఎప్పటికప్పుడు ఎత్తిపోతలు
మేడిగడ్డ బ్యారేజిలో పూర్తి స్థాయి సామర్ధం మేరకు 16.17టిఎంసీల నీటిని నిలువ చేస్తే నీటి వత్తిడిని తట్టుకోలేక మొత్త బ్యారేజి కుంగిపోవటమో ,లేక కొట్టుకుపోవటమో జరిగే ప్రమాదం కూడా నిపుణుల మెదళ్లను తొలుస్తోంది. తాత్కాలికంగా బ్యారేజిని ఉపయోగించుకునేందకు సాంకేతిక నిపుణలు కొన్ని ప్రతిపాదనలు కూడా సూచిస్తున్నారు. బ్యారేజిలో పూర్తి స్థాయి నీటిని నిలువ చేయకుండా నాలుగైదు టిఎంసీలకు లేదా అంతకంటే తక్కువ స్థాయిలో నీటిని నిలువ చేసి ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా ఎగువన ఉన్న అన్నారం , సుందిళ్ల బ్యారేజిలకు నీటిని ఎత్తిపోసే ప్రతిపాదనలను కూడా సూచిస్తున్నారు. బ్యారేజిలో తక్కవ నీటి నిలువ వల్ల బ్యారేజి పిల్లర్లపైన వత్తిడి కూడా తగ్గిపోయే అవకాశాలు పరిశీలించాలని సూచిస్తున్నారు. బ్యారేజిలో వీలైనంత తక్కువ నీటిని నిలువ చేసి , బ్యారేజి నుంచి పంప్‌హౌస్ వరకూ నదిలో అప్రోచ్ కాలువను తవ్వి నీటిని పంప్‌హౌస్‌కు తరిలించటం కూడా సులువుగా ఉంటుందన్నారు.
నిర్ణయాలు వేగంగా జరిగితేనే రైతుకు న్యాయం
మేడిగడ్డ బ్యారేజికి జరిగిన నష్టాన్ని సరిదిద్ది బ్యారేజీని తిరిగి ఉపయోగంలోకి తెచ్చుకోవటంలో ప్రభుత్వం వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటేనే రైతులకు న్యాయం జరగనుంది. బ్యారేజీ పునరుద్దరణలో జాప్యం జరిగే కొలది కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పంటల సాగుపై ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో వేగవంతంగా తీసుకునే నిర్ణయాలపైనే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News