Friday, November 22, 2024

ఐటిఆర్ ఫైలింగ్ గడువు తేదీ ఏమిటి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేయాల్సిన బాధ్యత ఆదాయం ఉన్న వారికి తప్పనిసరి. ప్రభుత్వానికి ఆదాయ సమకూర్చే ముఖ్య సాధనాలలో ఆదాయపు పన్ను ఒకటి. దాంతో జాతీయాభివృద్ధికి వీలు కలుగుతుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేసే చెల్లింపులు దేశాభివృద్దికి ఉపయోగపడతాయి.

ప్రతి సంవత్సరం ఆదాయపు పన్నులు రిటర్నులు వేయడం కీలకం. ఆదాయపు పన్ను కట్టే వారు ఆదాయ ధృవీకరణ సౌలభ్యం పొందొచ్చు. దాంతోపాటు లోన్ లు పొందడం, వీసాలకు అప్లయ్ చేయడం, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడం, ట్యాక్స్ రీఫండ్స్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

నేడు ఆదాయపు పన్ను ఫైలింగ్ స్ట్రీమ్ లైన్ చేయబడింది. ఆదాయపు పన్ను రిటర్నులు వేయని వారు కొన్ని హక్కులు కోల్పోతారు. పైగా పెనాల్టీలు కూడా పడొచ్చు. అంతేకాదు కట్టని పన్నులకు వడ్డీ కూడా కట్టాల్సి రావొచ్చు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఫైనాన్షియల్ ఇయర్ 2023-24) ఆడిటింగ్ అవసరం లేని వారు ఆదాయపు పన్ను రిటర్నులు వేయాల్సిన చివరి తేదీ 31 జులై 2024(బుధవారం).

Category of Taxpayer
Due Date for Tax Filing – FY 2023-24 *(unless extended)*
Individual / HUF/ AOP/ BOI (books of accounts not required to be audited) 31st July 2024
Businesses (Requiring Audit) 31st October 2024
Businesses requiring transfer pricing reports (in case of international/specified domestic transactions) 30th November 2024
Revised return 31 December 2024
Belated/late return 31 December 2024
Updated return
31 March 2027 (2 years from the end of the relevant Assessment Year)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News