- Advertisement -
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్టే బేడా సర్దుకుని సిద్ధంగా ఉండాలని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు మంత్రులకు పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ సలహా ఇచ్చారు. బిజెపి పాలనలో రాష్ట్రం అవినీతి ఊబిలో ఇరుక్కుపోయిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే విధాన సౌధ(అసెంబ్లీ భవనం) గోమూత్రంతో శుద్ధి చేస్తామని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డికె ప్రకటించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి బొమ్మై, బిజెపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి బొమ్మైకు ధైర్యముంటే తన పాలనపైన, ఇప్పటి బిజెపి ప్రభుత్వంపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ నియమించాలని ఆయన సవాలు చేశారు.
- Advertisement -