Monday, December 23, 2024

చంద్రుడిపై రాకేష్ రోషన్: మమత తికమక(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: మాట జారితే ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అది కూడా బహిరంగ ఉపన్యాసాలలో పొరపాటు దొర్లితే ఎలాంటి సంకట స్థితి ఎదురవుతుందో చెప్పలేము. ఇదే పరిస్థితిప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురవుతోంది.

చంద్రయాన్3 మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులను అభినందించిన మమతా బెనర్జీ పొరపాటున భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ పేరును ప్రముఖ సినీ దర్శకుడు రాకేష్ రోషన్‌గా పేర్కొని సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్ బారినపడ్డారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రస్తావిస్తూ రాకేష్ రోషన్ అంతరిక్షానికి వెళ్లారంటూ మమత కొత్త విషయం బయటపెట్టారు.

కోల్‌కతాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మమత ఇస్రో సైంటిస్టులను అభినందిస్తూ ..ముందుగా ఇస్రోకు శుభాకాంక్షలు. దయచేసి సురక్షితంగా దిగండి. మీ యాత్ర సురక్షితంగా, విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు..గతంలో కూడా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ చంద్రుడి వద్దకు వ్యోమగాములను పంపారు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్లం. రాకేష్ రోషన్ చంద్రుడిపై కాలుపెట్టినపుడు అక్కడి నుంచి భూమి ఎలా కనిపిస్తోందని ఇందిరా గాంధీ అడిగారు. దానికి ఆయన సారా జహాసే అచ్చా హిందుస్తాన్ మహారా అంటూ చెప్పారు..అంటూ మమతా బెనర్జీ ప్రసంగించారు.

మమత ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెను నెటిజన్లు తమ వ్యంగ్య కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలో మొట్టమొదటి భారతీయ కాస్మోనాట్ మారిన రాకేష్ రోషన్‌కు అభినందనలు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా థ్యాంక్ యు రాకేష్ రోషన్ సర్ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News