Wednesday, January 22, 2025

గిరిజనుల ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన వేళ..

- Advertisement -
- Advertisement -

రామారెడ్డి:గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు భూములకు పట్టాలను కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దిన్‌లతో కలిసి కామారెడ్డిలో ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విప్ గోవర్ధన్ మాట్లాడుతూ మాచా రెడ్డి,రా మారెడ్డి మండలాలకు చెందిన 668మంది లబ్ధ్దిదారులకు 1వేయి 6వందల 68 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.

గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతో ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూసిన ఎదురుచూపులకు తెరపడినట్లు వారి కళ సాకారం అయినట్లు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో గిరిజనులను కాంగ్రెస్,బిజెపిలు ఓటు బ్యాంక్‌గానే పరిగణించాయని ఆవేధన వ్యక్తం చేశారు.సిఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నెరవేరిందని ,తెలంగాణ వస్తే ఏం జరిగిందని ప్రశ్నించే వాళ్లకు ఇది చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో 3లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే ప్రస్తుతం 4.60లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంపిపి నారెడ్డి దశరథ్‌రెడ్డి,బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చి రెడ్డి, జగ దాంబతండా సర్పంచ్ గంగావత్ రాజునాయక్,ఉప సర్ప ంచ్ శంకర్,మాచారెడ్డి బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పగడాల బాల్ చంద్రం,బిఆర్‌ఎస్ నాయకులు చిన్న గంగారెడ్డి, నందనాయక్, చంద్రునాయక్,చోటు నందనాయక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News