Monday, December 23, 2024

దళితుల ఇండ్ల స్థలాల కల నెరవేరిన వేళ

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ మండలంలోని అనుగొండలో గత 40ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని దళితుల ఇండ్ల స్థలాల సమస్యకు శుక్రవారం తెరపడింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక వట్టం రవి కన్వెన్షన్ హాల్లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట జడ్పీ ఛైర్‌పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్‌ల చేతుల మీదుగా మొత్తం 45మంది దళితులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. ఏళ్లుగా తాము ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూశామని, తమ కల సాకారం కావడంతో లబ్ధ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిడీఓ శ్రీధర్, ఎంపిఓ పావని, ఎంపిపి వనజ, డిటిలు సురేష్, వాసుదేవరావు, సర్పంచు గడ్డం రమేష్, ఎంపిటిసి నంబర్ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News