Wednesday, January 22, 2025

గ్యారెంటీల అమలు ఎప్పుడంటే…

- Advertisement -
- Advertisement -

రేవంత్ కీలక నిర్ణయం – రేషన్ కార్డుతో లింక్!!

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. దీని కోసం తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లోగా పథకాల అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

అమలు చేస్తాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం..అని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. నిజమైన అర్హులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు.

ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని మంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించారు. దరఖాస్తుల ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెలాఖరు వరకు సమయం కావాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది.
వంద రోజుల్లోనే..
డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, సబ్ కమిటీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో పొందుపరుస్తామని చెప్పారు. దరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని వెల్లడించారు. తాము చెప్పిన విధంగా వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News