Thursday, January 9, 2025

టెండర్ వేసేది ఎప్పుడు… బిల్డింగ్ కట్టేది ఎన్నడు?

- Advertisement -
- Advertisement -
  • శిథిలావస్థకు చేరిన ఎర్రగడ్డ తండా పాఠశాల
  • టెండర్లు వేయడంలో అధికారుల నిర్లక్షం
  • భయానక పరిస్థితులలో పాఠాలు వింటున్న విద్యార్థులు

పెద్దేముల్: దేవుడు కరుణించినా.. పూజారి కనుకరించడం లేదన్నట్లుగా అధికారుల తీరు తయారైంది. మండల పరిధిలోని ఎర్రగడ్డ తండాలో పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో సర్పంచ్ శంకర్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు సురేశ్‌లు కలిసి గతంలో ఎమ్మె ల్యే పంజుగుల రోహిత్‌రెడ్డిని కోరారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన పాఠశాలను నిర్మించేందుకు ఎస్‌డీఎఫ్ క్రింద రూ.23.50 లక్షలు మం జూరు చేయించారు.

అయితే మరో 2.5 లక్షల డబ్బులు అదనంగా అవసరం పడటంతో ఎస్టిమేషన్ వేసి రూ.26 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. నూతన భవనాన్ని నిర్మి ంచేందుకు ఫిబ్రవరి మాసంలోనే నిధులను మంజూరు చేశారు. నాటి నుంచి నూతన భవనానికి టెండర్ వేయ డం లేదు. ఇదే విషయాన్ని తండాకు చెందిన పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికి ఎలాం టి ఫలితం లేకుండాపోయింది. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది.

ఇందులో మొత్తం 47 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల శిథిలం అవ్వడంతో పలుసార్లు తరగతి గది భయటే కూర్చోబెట్టి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షం పడితే కూలిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొ ంటున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలకు విద్యార్థుల ను పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఫిబ్ర వరిలో మంజూరైన పాఠశాలకు టెండర్ ప్రక్రియను పూర్తిచేసి ఉంటే ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యేవి. కానీ, అధికారులు మాత్రం టెండర్ వేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారా భవన్, ఇతరత్రా పనులు ఉన్నాయం టూ దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారు.

ఫలితంగా గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో భయానక పరిస్థితులలో విద్యార్థులు క్లాసులు వింటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెండర్ ప్రక్రియను పూర్తిచేసి భవన నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News