Monday, January 20, 2025

ఖాళీ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు : హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీరాజ్ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో ఈ నెల 28వ తేదీలోగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 220 పంచాయతీలు, 94 ఎంపిటిసి, నాలుగు జెడ్పీటీసీ, 5,364 వార్డులు, 344 ఉపసర్పంచి స్థానాలు ఖాళీగా ఉన్నాయని పిటిషనర్.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని మార్చిలోనే ప్రభుత్వానికి, ఎస్‌ఈసికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పేందుకు ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను హైకోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News