- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయి సిబిఐ కస్టడీలో ఉన్నారని, ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ భాటియా తెలిపారు.
అయితే సిసోడియా తన రాజీనామా లేఖలో తేదీ వేయకుండా పంపారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన కేజ్రీవాల్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలా ఉండగా మనీష్ సిసోడియా, సత్యేంద్ర రాజీనామాల దరిమిలా ఖాళీ అయిన రెండు క్యాబినెట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆతిషి సౌరభ్ భరద్వాజ్ పేర్లను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపించారు.
- Advertisement -