Monday, January 20, 2025

‘నవోదయం’ లేదా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన టిఆర్‌ఎస్ ఎంపిలు

జిల్లాకో విద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని లోక్‌సభలో నిలదీత 33జిల్లాలకు
9 నవోదయ విద్యాలయాలేనని ఆందోళన సిఎం కెసిఆర్ విజ్ఞప్తులకు స్పందన లేదని ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్‌లో మరోసారి కేంద్రం పై టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్ర ఫైర్ అయ్యారు. తెలంగాణ పట్ల కేం ద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తిగా కేంద్రం తుంగలోతొక్కిందని ధ్వజమెత్తారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో పెంచిన కొత్త జిల్లాలకు అనుగుణంగా నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏ ర్పాటు చేస్తారంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఒక నవోద య విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉ న్నా.. కానీ వాటిని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సోమవారం లోక్‌సభలో రంజిత్‌రెడ్డి, బిబి పాటిల్, మా లోతు కవిత, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ తదితరులు మాట్లాడుతూ, రాష్ట్రానికి కొత్త నవోదయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్న అంశంపై కేంద్రం స్పష్టమైన హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం శోఛనీయమని వ్యాఖ్యానించా రు. నవోదయ పాఠశాలల ఏర్పాటును కూడా మోడీ సర్కార్ రాజకీయ కోణంలో చూడడం తగదన్నారు.

తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయని, అయితే కేవలం తొమ్మిది నవోదయ వి ద్యాలయాలు మాత్రమే ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణలో 2014 మే చివరి నాటికి ఉన్న జిల్లా ల్లో మాత్రమే జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి ఎంపిలకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. నవోదయల ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అని, నిధుల లభ్యత ఆధారంగా కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని, వాటిలో 1467 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని వీటిల్లో 36,731 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 26 శాశ్వత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.

కాగా కేంద్రం ఇచ్చిన సమాధానంపై టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభ నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్రం పట్ల వివక్షను మానుకోలేకపోతోందని మండిపడ్డారు. ప్రదానంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందన్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఐటి సెక్టార్ అభివృద్ధిని చూసి కేంద్రం తట్టుకోలేకపోతోందని విమర్శించారు. హైదరాబాద్‌కు పెద్ద పెద్ద కంపెనీలు, స్టార్ట్‌అప్‌లు వస్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో టి హబ్..2 ప్రారంభించామన్నారు. తాజాగా కేంద్రం ప్రకటించిన 25 సాఫ్ట్‌వేర్ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. రాష్ట్రం పట్ల కక్షను పెంచుకునే కేంద్రం ఐటిఐఆర్ రద్దు చేసిందని మండిపడ్డారు.

ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయడం వల్లే సభ్యులను సస్పెండ్ చేశారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దీనికి నిరసనగా 50 గంటల దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం దేశంలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఎంపి బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ, కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని దేశ ప్రజల్లో చైతన్యం వస్తుందని భయంతోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం బాగా అమలు జరుగుతుంటే 16 బృందాలను పంపి వాటిని నిలిపివేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ధాన్యం కొనకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లలో పేద వర్గాలకు ఏ రాష్ట్రంలో చేయనట్టుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News