Monday, December 23, 2024

పుల్వామా అమరులకు న్యాయం ఎన్నడు ?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిపై అసంఖ్యాక ప్రశ్నలకు ఇంకా జవాబులు రావలసి ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఆ దాడిలో అమరులైన భద్రత సిబ్బందికి ఎప్పుడు న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్ర దాడి వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమ విభాగాలలో ఒక వీడియో పంచుకున్నారు. ఆ దాడిలో హతులైన భద్రత సిబ్బంది కుటుంబ సభ్యులతో తాను ఇటీవల జరిపిన చర్చల వీడియోను రాహుల్ పంచుకున్నారు.

దాడి గురించి తమకు సమాచారం అందిన తరువాత తాము పడిన ఇబ్బందుల గురించి అమర సైనికుల కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆ దాడిపై దర్యాప్తు ఇంత వరకు ఎందుకు పూర్తి కాలేదని వారిలో పలువురు ప్రశ్నించారు. వీడియోతో కలిపి తాను చేసిన పోస్ట్‌లో ‘పుల్వామా దాడికి ఐదు సంవత్సరాలు. విచారణ లేదు. ఆశ లేదు. అసంఖ్యాక ప్రశ్నలకు ఇంకా సమాధానం రావలసి ఉంది. అమరులకు న్యాయంఎప్పుడు జరుగుతుంది?’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘పుల్వామా అమరుల తిరుగులేని ధైర్య సాహసాలకు చిత్తశుద్ధితో నివాళులు, జోహార్లు అర్పిస్తున్నాం. దేశం వారి త్యాగానికి ఎన్నటికీ రుణపడి ఉంటుంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News