ఎల్బీనగర్ : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో బొమ్మల గుడి ఏరియాలో 600గజాల పార్కు స్థ్దలాన్ని కబ్జా చేసిందా.. నిజమా కాదా.. అని బిజెపి డివిజన్ అధ్యక్షులు నాంపల్లి రామేశ్వర్ ప్రశ్నించారు? మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామేశ్వర్ ,బిజెపి నా యకులు మాట్లాడుతూ… మన్సూరాబాద్ సర్వే నెంబర్ 72లో 32గుంటల ప్ర భు త్వ స్థ్దలం ఉంది. 32 గుంటల్లో 1565 గజాల ప్రభుత్వ స్థ్దలం ఉండాలి ,అది ఎక్కడ పోయింది ? దీనిపై కలెక్టర్ ,జిహెచ్‌ఎంసి కమిషన్‌ర్‌కు మేము ఫిర్యాదు చేశామని తెలిపారు.
నీటిపారుదల శాఖ అధికారులకు ‘ఫెడస్టల్’ మ్యాప్ బయటికి తీసి ,రీ సర్వే చేయాలని తెలిపామని పేర్కోన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తప్పు సర్వే నెంబర్ సృష్టించి జిహెచ్‌ఎంసి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతన్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ పాలనలో మాజీ కార్పొరేటర్ కోప్పుల విఠల్‌రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో వీరన్నగుట్టను ఏమా త్రం అభివృద్ధ్ది చెయలేదని విమర్శించారు.
వీరన్నగుట్టలో బిఆర్‌ఎస్ నాయకులు గుట్టను తొలగించి జీవో నెంబర్ 58,59లో చిన్న చిన్న గుడిసెలు వేసి కబ్జాకు చేస్తున్నది నిజమా కాదా ప్రశ్నించారు? ఈ జీవోలో ప్రభుత్వ భూమిని రెగ్యులైర్‌జేషన్ చేసుకుంటుంటే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తెలియదా? హత్తిగూడ చెరువులో 50 ,100 లారీల ట్రిప్పుల మట్టిని నింపుతుంటే ఎమ్మెల్యేకు కనిపించడం లేదా , ఈ చెరువు కబ్జాకు గురైతై సుమారు 15 కాలనీలకు ముంపుకు సమస్య ఏర్పడుతుందని తెలిపారు. వీరన్నగుట్టలో బస్తీ నిద్రలో గత నాలుగు సంవత్సరాలుగా సమస్యలు కనిపించడం లేదా ,బిఆర్‌ఎస్ నాయకులు మా కార్పొరేటరు మీద బురద చల్లడం మా నుకోవాలని లేనిపక్షంలో మీ చిల్లర చేష్టలు మాకు తెలుసు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డికవితా ,యాంజలజగన్ ,పాతురి శ్రీధర్ గౌడ్ ,కడారి యాదగిరి ,కోటయ్య ,చింటు ,పారందసాయి ,రమేష్‌చారి ,చిన్నరామస్వామి ,వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.