Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్ ఎటువైపు?

- Advertisement -
- Advertisement -

అదానీపై పార్టీ వైఖరి
ఏమిటో బయటపెట్టాలి
అదానీ ఆర్థిక అవకతవకలపై
మోడీ జెపిసి వేయాలి
జెపిసి వేయకపోతే
రాష్ట్రపతిభవన్‌ను
ముట్టడిస్తాం ఛలో
రాజ్‌భవన్ నిరసన
కార్యక్రమంలో సిఎం
రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : అదానీ విషయంలో బిఆర్‌ఎస్ స్టాండ్ ఏ మిటో చెప్పాలని సిఎం రేవంత్ డి మాండ్ చేశారు. 75 ఏళ్లు కష్టపడి దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పెంచితే ప్రధాని మోడీ, ఆయన మిత్రుడు అదానీ కలి సి దేశ పరువు తీశారని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ ఆర్థిక అ వకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసిసి
ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం (డిసెంబర్ 18) ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లస్‌రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి రాజ్‌భవన్ మార్గంలో బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ వ్యాపారం చేసేందుకు బిలియనీర్ అదానీ లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారని, కానీ, ప్రధాని మోడీ దీనిపై మౌనంగా ఉంటున్నారని సిఎం అన్నారు. అదానీతో ప్రధాని మోడీకి లాలూచీ ఒప్పందం ఉందని అందుకే అదానీ కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడించామని ఆయన తెలిపారు.

మా పోరాటం ఇక్కడితో ఆగదు
మా పోరాటం ఇక్కడితో ఆగదని, అదానీ అంశంపై జేపిసి ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని, కానీ, దేశ ప్రతిష్టను కాపాడుకోవడానికే రోడ్డుపై నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే మేం ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ముఖ్యమంత్రి ధర్నా చేస్తారా అని బిఆర్‌ఎస్ అంటోందని, తాను ధర్నా చేయనని, మరీ వాళ్లు వచ్చి చేస్తారా అని ప్రశ్నించారు. అదానీ అంశంపై బిఆర్‌ఎస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అదానీపై విచారణకు జెపిసి వేయాలి
అదానీపై విచారణకు జెపిసిని వేయాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. అసలు అదానీని కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో ఆ విషయం తేలాలన్నారు. జేపిసి వేస్తే తప్పకుండా అదానీ జైలుకు వెళ్తారన్నారు. వేయకపోతే మోడీనే అదానీని కాపాడినట్లవుతుందని సిఎం రేవంత్ తెలిపారు. అదానీతో మోడీ లాలూచీ ఒప్పందం చేసుకున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు.బిఆర్‌ఎస్, బిజెపిలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. అరెస్ట్ వార్తలు రాగానే హుటాహుటీన కెటిఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. నాణానికి ఒకవైపు మోడీ, మరోవైపు కెసిఆర్ ఉంటారని ఆయన అన్నారు.

అదానీ దేశ సంపద దోచుకుంటున్నారు: డిప్యూటీ సిఎం
ప్రధాని మోడీ ఆశీస్సులతో ఆయన మిత్రుడు, బిలియనీర్ గౌతమ్ అదానీ దేశ సంపద దోచుకుంటున్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అదానీ దేశ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అదానీ దేశ ప్రజలను సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నారో, బ్యాంకులను ఓ విధంగా మోసం చేశారో హిండెన్ బర్గ్, అమెరికా న్యాయవాదులు చెప్పారని డిప్యూటీ సిఎం గుర్తు చేశారు. అదానీ ఆర్థిక అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోతున్న మోడీ నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే అదానీ ఇష్యూ, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దిగామని ఆయన తెలిపారు.

మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు
అదానీపై జేపిసి విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టామని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మోడీ, అదానీ జోడి దేశ ప్రజలారా ఇకనైనా కళ్లు తెరవండని ఉన్న ప్లకార్డులను సిఎం రేవంత్‌రెడ్డి పట్టుకొని నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News