Saturday, November 23, 2024

కమ్యూనిజం, బహుజన వాదం ఎక్కడ పోయింది ఈటెల: పల్లా

- Advertisement -
- Advertisement -

Where is communism etela Rajender

హైదరాబాద్: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంఎల్‌సి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యవసాయం రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, ప్రతీ గ్రామంలో చెరువులు నిర్మించుకున్నామని, దేశంలో ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పల్లా కొనియాడారు. ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను సిఎం కెసిఆర్ తీర్చిదిద్దారని, కరోనా కష్ట కాలంలో తెలంగాణ ప్రజలను ఆదుకున్నామని, లాక్‌డౌన్ సమయంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందా? అని ప్రశ్నించారు.

రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేంద్రం అసమర్థ పాలనలో దేశాభివృద్ధి కుంటుపడిందని, నాలుగు దశాబ్ధాల్లో లేని విధంగా దేశ జిడిపి కనిష్టి స్థాయి పడిపోయిందని, తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణలోని అన్ని శాఖల్లో మిగిలి ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమని ప్రశంసించారు. తెలంగాణలోని రెండు లక్షల మంద ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ది కమ్యూనిజం, బహుజన వాదం ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు. చట్టపరమైన పనులు చేయాల్సిన మీరు చట్టవిరుద్ధంగా దేవాలయ భూములను ఎలా కొన్నారని పల్లా ప్రశ్నించారు. ఈటెల మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. ఈటెలను సఎం కెసిఆర్ సొంత తమ్ముడిలా చూసుకున్నారని, సిఎం కెసిఆర్ కీలక పదవులను ఈటెలకు కట్టబెట్టారని, ఏనాడైన పదవి లేకుండా ఈటెల ఉన్నారా? అని నిలదీశారు. పార్టీ నాయకత్వం, నేతలను కించపర్చే విధంగా మాట్లాడడం సరికాదని ఈటెలపై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News