Sunday, December 22, 2024

జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?, జగన్ సిఎం అయ్యాక ప్రత్యేక హోదాను మరిచిపోయారని చురకలంటించారు. తిరువూరులో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐదేళ్ల నుంచి ప్రత్యేకహోదా ఊసే లేదని, మన బిడ్డల భవష్యత్‌పై జగన్ ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారని, ఏమైందని, ఐదు సంక్రాంతిలొచ్చాయని, కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ కోడిపందేలు జరిగాయని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా?, కుంభకర్ణుడైనా ఆరు నెలలకు లేస్తారని, జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదని షర్మల విమర్శలు గుప్పించారు.

మూడు రాజధానులన్నారని, ఒక్కటీ లేకుండా చేశారని, ఎపి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని, మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలని, జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచుతారని షర్మల దుయ్యబట్టారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారని, ఏమైందని, ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ.3 వేల కోట్ల పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. పూర్తి మద్యపాన నిషేధమన్నారని, సర్కారే మద్యం అమ్ముతోందని, నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారని, బటన్ నొక్కితే వచ్చేది వంద రూపాయిలు కానీ జగన్ లాక్కుంటుంది వెయ్యి రూపాయలు అని ఆమె మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News